ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ త‌గ్గుముఖం ప‌డుతోంది. వేగవంతంగా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తూ వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి ఏపీ స‌ర్కార్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. ఏపీలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుతుండ‌డం.. వైర‌స్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. శనివారం వైరస్‌ బారి నుంచి కోలుకుని 45 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ప్రస్తుతం 999 యాక్టివ్‌ కేసులున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 వరకు మొత్తం 8,388 మందిని పరీక్షించగా కేవ‌లం 43 మందికి మాత్ర‌మే పాజిటివ్‌ వచ్చింది.  

 

రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్న వారు 887 మంది. కొత్తగా మరో మూడు మరణాల నమోదుతో ఇప్పటి వరకూ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 44కి చేరింది. ఏపీలో ఇప్పటి వరకూ 1,65,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం పాజిటివ్‌ కేసులు 1,930కి చేరాయి. అయితే.. ఏపీలో ఇన్‌ఫెక్షన్‌ రేటు 1.17శాతంగా ఉంది. ఇది మంచి ప‌రిణామ‌మ‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే క‌రోనాను మ‌రింత అదుపుచేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: