భార‌త‌దేశంలో క‌ర‌నా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. అయితే.. దేశ‌వ్యాప్తంగా కేవలం 15 జిల్లాల్లోనే అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు న‌మోదు అవ‌తున్నాయ‌ని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా న‌మోదు అవుతున్న కేసుల్లో 64శాతం పాజిటివ్ కేసులు ఈ 15జిల్లాల నుంచే ఉన్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అందులోనూ ఐదు జిల్లాల్లో వైర‌స్ ప్ర‌భావం మ‌రింత తీవ్రంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశ‌వ్యాప్తంగా న‌మోదు అవుతున్న కేసుల్లో దాదాపుగా 50శాతం పాజిటివ్ కేసులు 50శాతం ఉన్నాయ‌ని చెబుతున్నారు.

 

ప్ర‌ధానంగా ఢిల్లీ, పుణె, ముంబై, అహ్మ‌దాబాద్, చెన్నైలోనే 50శాతం కేసులు ఉన్నాయ‌ని అమితాబ్‌కాంత్ చెబుతున్నారు. ఈ ఈ ప్రాంతాల్లో వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌డితే క‌రోనా వైర‌స్‌పై భార‌త్ విజ‌యం సాధించిన‌ట్టేన‌ని గ‌తంలోనూ అమితాబ్ కాంత్ చెప్పిన విష‌యం తెలిసిందే. కాగా, భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 59,662 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. శనివారం సంభ‌వించిన‌ మరణాలలో 42శాతం మ‌ర‌ణాలు మహారాష్ట్రలోనే న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 2,000 దాటింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: