ఇప్పుడున్న టైంలో క‌రోనా ప్ర‌పంచంలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల‌ను అత్యంత సులువుగా మింగేస్తోంది. క‌రోనా దెబ్బ‌తో ఎవ‌రికి వారు విల‌విల్లాడి పోతున్నారు. ఇక వృద్ధుల సంగ‌తి చెప్ప‌క్క‌ర్లేదు. కానీ యూర‌ప్‌కు చెందిన‌ ఓ 110 ఏళ్ల బామ్మ మాత్రం త‌న 110వ పుట్టిన రోజును ఎంజాయ్ చేస్తూ జ‌రుపుకుంది. పైగా ఆమెకు వంద‌లాది మంది పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. బ్యాండు మేళం వాయింపుల‌తో పాటు ఓ పెద్ద కేక్ తెచ్చి ఆమె ముందు పెట్టి క‌ట్ చేయించారు. వాళ్లంతా అలా చేస్తుంటే ఆ బామ్మ ఆనందంతో అటూ ఇటూ ఊగుతూ కుర్చీలోనే నృత్యం చేసింది.

 

స్థానిక రాజ‌కీయ నాయ‌కులు సైతం త‌ర‌లి వ‌చ్చి ఆ బామ్మ పుట్టిన రోజును పెద్ద వేడుక‌గా జ‌రిపారు. ఆ బామ్మ పేను అనితా రోజ‌స్‌. చివ‌ర‌కు పోలీసు బ్యాండ్ మోగిస్తూ ఆమెకు పోలీసులు సైతం పోలీస్ బ్యాండ్ మోగిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం విశేష‌మే.  ఇక వీథుల్లో ప్ర‌జ‌లు అంద‌రూ రోడ్ల‌మీద‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్లు కొడుతూ ఆమెకు జై కొడుతూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పి పార్టీ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వ‌ర‌ల్డ్ వైడ్‌గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: