క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్న ప‌ది రాష్ట్రాల్లో నేడు కేంద్ర బృందాలు ప‌ర్య‌టిస్తున్నాయి. ఈ బృందంలో కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌కు చెందిన సీనియ‌ర్ అధికారి, జాయింట్ సెక్ర‌ట‌రీ స్థాయి నోడ‌ల్ అధికారి, ప్ర‌జారోగ్య నిపుణులు ఉన్నారు. గుజ‌రాత్‌, పంజాబ్‌, ఢిల్లీ, రాజ‌స్తాన్‌, ఆంధ్ర‌ప్రేద‌శ్‌, తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడులో కేంద్ర బృందాలు ప‌ర్య‌టిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి, క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చర్య‌లు, లాక్‌డౌన్ అమ‌లు త‌దిత‌ర అంశాల‌ను క్షేత్ర‌స్థాయిలో కేంద్ర బృందాలు ప‌రిశీలించ‌నున్నాయి.

 

నిజానికి.. తెలంగాణ‌, ఏపీలో ఇప్ప‌టివ‌కే కేంద్ర బృందాలు ప‌ర్య‌టించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశాయి. ప్ర‌ధానంగా ఏపీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, ఇంటింటి స‌ర్వే, లాక్‌డౌన్ అమ‌లు,  పేషెంట్ల‌కు అందిస్తున్న వైద్య‌సేవ‌లు భేష్‌గా ఉన్నాయ‌ని అభినందించించారు. ఈరోజు కూడా మ‌ళ్లీ కేంద్ర బృందాలు క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్న గుంటూరు, క‌ర్నూలు జిల్లాల్లో ప‌ర్య‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: