కరోనాపై పోరాటంలో పోలీసులు చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతీ ఒక్క అధికారి కూడా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఇక కష్టాల్లో ఉన్న ప్రజలను కూడా తమ వంతుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం గానూ తమ జీవితాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా మొరాదాబాద్ లో ఆకలితో ఉన్న వారిని ఆదుకున్నారు. 

 

తమ జీతాలను ఇచ్చేసారు. పోలీసులు మరియు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఐఎఫ్) సిబ్బంది రేషన్ కొనుగోలు చేయడానికి గానూ తమ జీతాలను అందించారు. మరియు నగరంలోని మురికివాడ ప్రాంతాల నివాసితులకు రేషన్, సబ్బులు, ముసుగులు, కూరగాయలు మరియు ఇతర వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: