అమెరికా అధ్యక్షా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ ప్రజల్లో జాతీయ భావం పెంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. కరోనా వైరస్ ని బూచి గా చూపించి గెలవడానికి గానూ నానా కష్టాలు పడుతున్నారు ట్రంప్. అధికారంలోకి రావడానికి ముందు నుంచి జాతీయ భావాన్ని ప్రజల్లో పెంచుతున్న ట్రంప్... ఇప్పుడు దానికి మరిన్ని మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 

 

కరోనా తర్వాత ఇమ్మిగ్రేషన్ మీద తాత్కాలిక నిషేధం విధించిన ట్రంప్... ఇప్పుడు హెచ్ 1 బీ వీసాల మీద అమెరికన్ల ఉద్యోగ భద్రతను దృష్టి లో పెట్టుకుని నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ట్రంప్ సార్ దీని మీద సంతకం చేసే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: