మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మిత్ర పక్షం కాంగ్రెస్ భారీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో షాక్ అవ్వడం ఉద్ధవ్ వంతయింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర రాష్ట్రంలోని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపి శివసేనకు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 
 
మొదట కాంగ్రెస్ పార్టీ ఒకరినే బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు బాలాసాహేబ్ థోరట్ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో శివసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ఇద్దరు బరిలోకి దిగడంతో అభ్యర్థుల సంఖ్య పదికి చేరింది. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం సూచించడంతో ఎన్నికలు అనివార్యం కాగా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను వెనక్కి తీసుకోమని చెప్పడంతో షాక్ అవ్వడం ఉద్ధవ్ వంతయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: