ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ లో ఎంత దూకుడుగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తాడో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అభిమానులకు వినోదాన్ని పంచుతూ ఉంటాడు. ఎప్పుడూ ఏదోక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య బాబు టిక్ టాక్ లో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నాడు. 

 

ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న వార్నర్ తాజాగా టిక్ టాక్ వీడియో లను తెలుగులో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా అతను మహేష్ బాబు పోకిరి సినిమాలో డైలాగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పోకిరి సినిమాలో ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ ని బ్యాట్ పట్టుకుని చేసాడు వార్నర్. దీనికి పూరి స్పందించి ధన్యవాదాలు తెలుపుతూ రీ ట్వీట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: