తెలుగు చలన చిత్ర రంగంలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నేటి రాత్రి రెండో పెళ్లి చేసుకోబోతున్నారు.  వాస్తవానికి గతంలో ఈ విషయం తెగ హంగామా అయ్యింది. ఒకదశలో దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారని తెగ వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటన్నీంటిని ఆయన కండించారు.  తాను కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన అధికారికంగా‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో దిల్‌ రాజు చేసిన ప్రకటనను పోస్ట్ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్... 'ఆల్‌ ది బెస్ట్‌ అన్న.. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను దీవిస్తూనే ఉంటాడు' అని పేర్కొన్నారు.

 

కొన్ని గంటల క్రితం దిల్‌ రాజు ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పిన విషయం తెలిసిందే.   తాను కొత్త జీవితం ప్రారంభించడానికి తనకు సమయం వచ్చిందని భావిస్తున్నానని చెప్పారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు తన పోస్ట్ లో పేర్కొన్నారు.   కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పారు. చాలా మంది కూడా వృత్తిపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వ్యక్తిగతంగా తన జీవితం ఇప్పుడు అంతా గొప్పగా లేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: