దేశంలో కరోనా ఎప్పుడైతే వచ్చిందో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  అయితే కరోనా లక్షణాలు కూడా త్వరగా బయట పడకపోవడంతో ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తుంది.  ఫిబ్రవరిలో మొదలైన  ఈ కరోనా ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెరిగిపోతూ వస్తుంది.  తాజాగా నిన్నటి వరకు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు గ్రీన్ జోన్ లో ఉన్న ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. జిల్లా పరిధిలోని ఆత్మకూరు (ఎం) మండలంలో 3 పాజిటివ్ కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్టు తెలిపారు. 

 

ఇప్పటి వరకు తెలంగాణలో గ్రీన్ జోన్ లొో ఉన్న యాదాద్రి ఇప్పుడు కరోనా వైరస్ కేసులు మొదలు కావడంతో టెన్షన్ పెరిగిపోయింది. ఈ నలుగురురు ఇంకెంత మందిని కలిసి ఉంటారని వారు ఎవరెవరు కలిసి ఉంటాన్న ఆరా తీస్తున్నారు.  ‘కరోనా’ పాజిటివ్ వచ్చిన నలుగురూ ఇటీవలే ముంబై నుంచి తమ స్వగ్రామాలకు వచ్చారని అధికారుల సమాచారం. ఈ నలుగురి ప్రైమరి కాంటాక్ట్ లను గుర్తిస్తున్నట్టు  అనితా రామచంద్రన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: