పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇమామ్ లు లేఖ రాసారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ మే చివరి వరకు పొడిగించాలని పశ్చిమ బెంగాల్ లోని ఇమామ్‌ల సంఘం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమంతా బెనర్జీకి లేఖ రాసింది. 

 

బెంగాల్ ఇమామ్స్ అసోసియేషన్, ఇస్లామిక్ మతాధికారుల సంఘం ఈ లేఖ రాసింది. ప్రజలను ముందు బ్రతకనివ్వండి పండగలు మన కోసం ఎదురు చూస్తాయిని పేర్కొన్నారు. మే 25 న జరిగే ఈద్‌కు లాక్డౌన్ ఎత్తివేయవద్దని ఇమామ్‌లు బెంగాల్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. తమకు ఉత్సవాలు అవసరం లేదని త్యాగాలు చేయడానికి సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: