హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణ సారధ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. బాలీవుడ్ లో హిట్ సినిమా దబంగ్ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఆయన నటన అన్నీ కూడా హైలెట్ గా నిలిచాయి.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా వచ్చి సరిగా 8 ఏళ్ళు అయింది. 2012 మే 11 న ఈ సినిమా విడుదల అయి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ అమాంతం పెరిగింది. అది పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫాన్స్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ట్విట్టర్ లో గబ్బర్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో లక్ష ట్వీట్స్ చేసారు.
Intha active gaa untarani anukola full happy 😊
— lokesh Dasari (@pawanified) May 10, 2020
Common cults let’s break our own record
1M tweets in 37 minutes
First chase this target 🎯 #8YrsOfGabbarSinghHysteria@PawanKalyan #VakeelSaab #GabbarSingh 🔥🔥🔥 pic.twitter.com/Qf1sbJcGoM