దేశంలో ఇప్పుడు కరోనా మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు మరణాలను దాస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొన్ని ఆస్పత్రులు మరణాలను దాచి పెడుతున్నాయి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. 

 

ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరణాలను దాస్తే మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వెంటనే రిపోర్ట్ చేయకపోతే మాత్రం ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రభుత్వ ఆస్పత్రులు అయినా సరే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. కాగా ఢిల్లీ లో కరోనా కేసులు 8 వేలు దాటిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నగరంలో భారీగా కరోనా కేసులు నమోదు కావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: