భారత సైన్యాన్ని ఇప్పుడు కరోనా కలవరపెడుతుంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన భారత సైనికులు ఇప్పుడు మహమ్మారి బారిన పడటం ప్రభుత్వాలను కూడా కలవరపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. సైన్యంలో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. నేవీ సహా పలు విభాగాల్లో కేసులు నిదానంగా పెరుగుతున్నాయి. 

 

భారత్ టిబెట్ సరిహద్దుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) కి చెందిన 56 మంది జవాన్లకు గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఐటిబిపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 156 కి చేరుకుంది. దీనిపై రక్షణ శాఖ అప్రమత్తమైంది. అటు సైనికుల కుటుంబాలను కూడా క్వారంటైన్ చేసింది ప్రభుత్వం. ఉన్నతాధికారులకు కూడా పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: