ఒక పక్క లాక్ డౌన్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం రవాణా ఆగడం లేదు. అటు తెలంగాణా లో కూడా మద్యం అక్రమ రవాణా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణా ను ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో ఈ హడావుడి ఎక్కువగా ఉంది. కర్నూలులో, తెలంగాణకు చెందిన మహబూబ్‌నగర్ నుంచి ద్విచక్ర వాహనాలపై అక్రమంగా రవాణా చేస్తున్న 500 మద్యం సీసాలను జిల్లా ఎక్సైజ్, నిషేధ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

కృష్ణా జిల్లాలో, 207 మద్యం బాటిళ్లను అక్రమంగా తీసుకువచ్చినందుకు గానూ ముగ్గురు వ్యక్తులను స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్టు చేయగా, గుంటూరు ఎక్సైజ్ అధికారులు 13 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 150 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉన్న నేపధ్యంలో ఈ విధంగా తెలంగాణా నుంచి మద్యం తరలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: