మూడు రోజుల క్రితం విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే తాజాగా మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని బోడిగాడితోట దగ్గర బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. ఫ్యాక్టరిలో యాసిడ్, బ్లీచింగ్ తదితర రసాయనాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు వెంటనే సమీపంలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 
 
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోనేలోపే ఫ్యాక్టరీలో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదైంది. ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కెమికల్ ఫ్యాక్టరీకి కొంత దూరంలో ఉన్న పేద ప్రజలు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో రోడ్లపైకి పరుగులు తీశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఘటన గురించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: