యూకే క‌రోనా వైర‌స్ విధ్వంసం కొన‌సాగుతోంది. రోజురోజుకూ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఇదే స‌మ‌యంలో మ‌ర‌ణాలు కూడా ఎక్కువ‌గా సంభ‌విస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 2,19,000 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక మ‌ర‌ణాల సంఖ్య 31,855కు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలో లాక్‌డౌన్‌ను జూన్ ఒక‌టో తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

 

కొవిడ్‌-19 వైర‌స్ క‌ట్ట‌డికి ఇదొక్క‌టే మార్గ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జ‌లంద‌రూ ఇందుకు స‌హ‌క‌రించి, లాక్‌డౌన్‌ను నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని ఆయ‌న కోరారు. నిజానికి.. ఏడు వారాల క్రితం విధించిన ఆంక్షలను ఎత్తివేసేందుకు ప్ర‌ధాని జాన్స‌న్‌ జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించారు.  ఇందులో భాగంగా దేశ‌వ్యాప్తంగా కనీసం జూన్ 1 వరకు ఉంటుందని ఆయ‌న చెప్పారు. అయితే.. పీఎం బోరిస్ జాన్స‌న్ నిర్ణ‌యాన్ని ప‌లువురు స‌మ‌ర్ధిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం వ్య‌తిరేకిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: