ప్రపంచాన్ని కకావిలకం చేస్తుంది కరోనా మహమ్మారి.  ప్రపంచలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ అతి తక్కువ కాలంలో ప్రపంచ దేశాలన్నీ విస్తరించి మనుషుల ప్రాణాలు బలికొంటుంది.  ఇప్పటి వరకు ఈ వ్యాధికి మెడిసన్ కనుగొనలేక పోవడం మరింత ఇబ్బందిగా మారింది.  అయితే అన్ని దేశాలు దీనిపై పరిశోదన చేస్తూ వ్యాక్సిన్ కనుగొనేందుకు నానా తంటాలు పడుతున్నారు.  ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం చేప మందు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.  ప్రతియేటా మృగశిర కార్తె ప్రవేశించగానే, వేలాదిగా ఉబ్బస రోగులు చేప ప్రసాదం కోసం హైదరాబాద్ వస్తుంటారన్న సంగతి తెలిసిందే.  వివిధ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఉబ్బసం వ్యాధి ఉన్నవారు ఈ చేపమందు వేయించుకోవడానికి బారులు తీరుతుంటారన్న విషయం తెలిసిందే.

 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.. ఇలాంటి పరిస్థితుల్లో చేప మందు పంపిణీ తో ఇబ్బందులు తలెత్తుతాయని భావింయిచి చేప ప్రసాదం పంపిణి చేయడం లేదని మీడియాకు ఓ ప్రకటన ద్వారా తెలిపిన బత్తిని హరినాథ్ గౌడ్, ఎవరైనా ఆన్ లైన్ లో పంపుతామన్నా, చేప ప్రసాదం ఉందని చెప్పినా నమ్మరాదని, అసలు తాము మందును కూడా తయారు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరూ చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దని వారు కోరారు. అంతే కాదు చేప మందు పంపినీ అని రూమర్లు సృష్టించినా నమ్మవొద్దని అన్నారు.  ఈ నెల 29తో తెలంగాణలో లాక్ డౌన్ ముగిసినా, తాము ప్రసాదాన్ని పంపిణీ చేయబోమని, ఎవరైనా తమ పేరిట మందు పంపిణీ చేస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: