అగ్ర‌రాజ్యాల్లో క‌రోనా విధ్వంసం కొన‌సాగుతోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోతున్నాయి. అన్నిరంగాలూ విల‌విలాడుతున్నాయి. ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. అదే స్థాయిలో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. యూర‌ప్‌, అమెరికాలోనే కాదు కొద్దిరోజులుగా రష్యా, బ్రెజిల్‌ వంటి దేశాల్లోనూ  వీటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది.  రష్యాలో 2,09,688 మందికి కరోనా సోకింది. దేశంలో ఇప్పటివరకు 1915 మరణించారు. 1,73,467 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 34,306 మంది బాధితులు కోలుకున్నారు. బ్రెజిల్‌లో 1,62,699 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇప్పటివరకు 11,123 మంది మరణించారు. దేశంలో 86,679 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 

 ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 41,80,303కు చేరింది. ఇందులో 2,83,860 మంది బాధితులు మరణించారు. ప్రాణాంతక వైరస్‌ బారినుంచి 14,90,776 కోలుకుని డిశ్చార్చికాగా, మరో 24,05,667 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అమెరికాలో ఇప్పటివరకు 13,67,638 కరోనా కేసులు నమోదయ్యాయి.  80787 మంది మరణించారు. ఇంకా 10,30,515 కరోనా పాజిటివ్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక స్పెయిన్‌లో 2,64,663 మంది ఈ వైరస్‌ బారిన పడగా, ఇప్పటివరకు 26,621 మంది మరణించారు. మరో 61,603 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,76,439 మంది బాధితులు కోలుకున్నారు. ఆ త‌ర్వాత‌ యూకేలో 2,19,183 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఈ వైరస్ కార‌ణంగా 31,855 మంది బాధితులు మృతిచెందారు. ఇటలీలో ఇప్పటివరకు 2,19,070 కరోనా కేసులు నమోదుకాగా 30,560 మంది మరణించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: