దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.  ఓ వైపు లాక్ డౌన్ పాటిస్తున్నా.. కరోనా మహమ్మారి మాత్రం విజృంభిస్తూనే ఉంది.  మొదట్లో ఈ వైరస్ ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వల్ల అన్నా.. తర్వాత మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారి వల్ల తీవ్రంగా ప్రబలిపోయింది.   ఈ కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది అమాకులు బలి అవుతున్నారు. పేద, ధనిక చిన్నా పెద్ద అనే తేడా లేకుండా కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ఇక మనకు రక్షణగా ఉంటూ వస్తున్న పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికులను సైతం వదలడం లేదు. ఇక విశాఖపట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విడుదలైన గ్యాస్ విశాఖపై    ఇంకా ప్రభావం చూపుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు కరోనా ప్రభావం కూడా మొదలైంది. 

 

నగరానికి చెందిన ముగ్గురు నిన్న వైరస్ బారినపడ్డారు. వీరిలో మహిళా హోం గార్డు కూడా ఉన్నారు. మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే ఆమె నివసించే కొబ్బరితోట ప్రాంతంలో కలకలం రేగింది. అలాగే, ఆమె పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ సిబ్బందిలోనూ గుబులు మొదలైంది. బాధితురాలిని గీతం ఆసుపత్రికి తరలించగా, ఆమె తండ్రి, సోదరిని క్వారంటైన్‌కు తరలించారు. బాధితురాలిని గీతం ఆసుపత్రికి తరలించగా, ఆమె తండ్రి, సోదరిని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా బారినపడిన మిగతా ఇద్దరిలో ఒకరు దండుబజార్‌కు చెందిన మహిళ కాగా, మరొకరు గాజువాక ప్రియదర్శిని. 

మరింత సమాచారం తెలుసుకోండి: