సినిమాల్లోకి రాకపోయినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీర నందన్ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అతని గురించిన ఏదోక వార్త మీడియాలో వస్తూనే ఉంటుంది. ఇక అతని తల్లి రేణుదేశాయ్ అయితే కొడుకు గురించి ఏదోక రూపంలో ప్రస్తావిస్తూ ఉంటారు. తన కుమారుడు సినిమాల్లో హీరో గా  అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తే చూడాలి అనేది ఆమె కోరిక. 

 

బాబు హైట్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి అతను సినిమాల్లోకి రావాలని వస్తే ఆదరిస్తాం అని పవన్ ఫాన్స్ అంటున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు అతని ఫేవరేట్ హీరో గురించి తల్లి రేణు దేశాయ్ ఆసక్తికర విషయం చెప్పింది. ‘ఎవరు’ సినిమా చూసిన తరువాత నుంచి అకిరా.. అడివి శేష్‌ని అమితంగా ఇష్టపడటం మొదలు పెట్టాడని ఆమె వివరించింది. అడవి శేష్ ని అతను అన్నా అని పిలుస్తాడని వాళ్ళు స్నేహం కూడా చేస్తున్నారని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: