టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రస్తుతం దిల్ రాజు వివాహం గురించే చర్చ జరుగుతోంది. మూడేళ్ల క్రితం ఆయన సతీమణి గుండెపోటుతో మరణించటంతో దిల్ రాజు విషాదంలో కూరుకుపోయారు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు రెండో పెళ్లి చేసుకోవాలని కోరడంతో దిల్ రాజు అందుకు అంగీకరించారు. 
 
నిన్న రాత్రి దిల్ రాజు వివాహం నిజామాబాద్ జిల్లాలోని సొంతూరులో నిరాడంబరంగా జరిగింది. ఈ వేడకకు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. లాక్ డౌన్ వల్ల పెళ్లికి హాజరు కాలేకపోయిన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో దిల్ రాజు పెళ్లి ఫోటోలను షేర్ చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లలో దిల్ రాజు పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వధువుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎంతో మంది ప్రముఖులు పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: