మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్రలోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు మే 21వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. శివసేన మిత్రపక్షమైన కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపటంతో ఉద్ధవ్ ఇరకాటంలో పడ్డారు. కానీ కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసిన రాజ్ కిషోర్ మోదీ నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో ఉద్ధవ్ కు పెద్ద గండమే తప్పింది. 
 
కాంగ్రెస్ ఒక్కరినే బరిలోకి దింపడంతో ఉద్ధవ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే మే 27వ తేదీలోపు శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం ఉభయ సభల్లో సభ్యులు కానివారెవరైనా మంత్రి లేదా ముఖ్యమంత్రి అయితే ఆరునెలల్లోగా సభ్యుడు కావాలి. లేకుంటే వారు ఆ పదవికి అనర్హులవుతారు.ఉద్ధవ్ ఠాక్రే మే 28 నాటికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తి కానుంది. ఆ లోగా ఉద్ధవ్ ఎమ్మెల్సీగా నామినేట్ కావాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: