విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో జగన్ సర్కార్ కు 300 కోట్ల రూపాయలు అందాయని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై తీవ్రమైన కేసులు పెట్టకుండా... కంపెనీని తరలించకుండా... కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేయకుండా...కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు జగన్ సర్కార్ డీల్ కుదుర్చుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
అందుకే బాధితులు కంపెనీ దగ్గర ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. సీఎం జగన్ కు ఎల్జీ పాలిమర్స్ కు ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ కు అనుమతులు ఇచ్చిందని ఒక మంత్రి వ్యాఖ్యలు చేశారని... 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ గతంలో ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని అన్నారు. వైసీపీ నేతలది ఎదురుదాడి చేసే తత్వమని ప్రజలంతా వైసీపీ నేతలను అసహ్యించుకుంటున్నారని బోండా ఉమ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: