విదేశాల నుంచి వ‌చ్చిన వారి కోసం హైద‌రాబాద్‌లోని ప‌లు హోట‌ళ్ల‌లో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్‌లో బిల్లుల మోత మోగుతోంది. బాధితుల జేబుల‌కు చిల్లులుప‌డుతున్నాయి. వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా విదేశాల నుంచి వ‌చ్చిన వారిని నేరుగా పెయిడ్ క్వారంటైన్ల‌కు త‌ర‌లిస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. పెయిడ్ క్వారంటైన్(14రోజులు)‌లో ఒక్కొక్క‌రు రూ.30వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. గ‌చ్చిబౌలి, సికింద్ర‌బాద్‌లోని ప‌లు స్టార్‌ హోట‌ళ్ల‌లో పెయిడ్ క్వారంటైన్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే.. ఇక్క‌డ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎడాపెడా హోట‌ళ్లు బిల్లులు వేస్తున్నాయ‌ని ఆరోపిస్తున్నారు.

 

రెండు పండ్ల‌కు రూ. 540, సింగిల్ బ‌ర్గ‌ర్‌కు రూ.500 తీసుకుంటున్న‌ట్లు బాధితులు చెబుతున్నారు. కేవ‌లం క‌ప్పు అన్నం, రెండు రొట్టెలు మాత్ర‌మే ఇస్తున్నార‌ని ఆవేద‌న చెందుతున్నారు. త‌మ నుంచి పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు వసూలు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. పెయిడ్ క్వారంటైన్ల కంటే ఉచిత క్వారంటైన్లే మేల‌ని అంటున్నారు. కాగా, క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విదేశాల్లో భార‌తీయులు చిక్కుకున్నారు. అయితే..కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన వందేభార‌త్ మిష‌న్‌తో వారంద‌రూ ఇండియాకు తిరిగివ‌స్తున్నారు. ప్ర‌త్యేక విమానాలు, షిప్‌ల‌లో కేంద్ర ప్ర‌భుత్వం భార‌తీయుల‌ను తీసుకొస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: