ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా పదో తరగతి పరిక్షలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరిక్షల నిర్వహణ పై అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏ ప్రకటనా ఇప్పటి వరకు రాలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పది పరిక్షలపై కీలక ప్రకటన చేసారు. 

 

జులై లో పదో తరగతి పరిక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. దీనిపై త్వరలోనే షెడ్యుల్ కూడా విడుదల చేస్తామని ఆయన వివరించారు. లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత పరిక్షలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భౌతిక దూరం సహా మాస్క్ లను పెట్టుకుని పది పరిక్షలు నిర్వహిస్తామని విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని పరిక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: