దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 4200 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ అంశాల గురించి చర్చించనున్నారు. రెండు సెషన్ల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు. ఈరోజు 3 గంటల నుంచి 5.30 గంటల వరకు తొలి సెషన్ కాగా 6 గంటల నుంచి రెండో సెషన్ ప్రారంభం కానుంది. 
 
మోదీ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అందరు సీఎంలకు మాట్లాడే అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. మరోసారి లాక్ డౌన్ పొడిగింపుకే ప్రధాని మోదీ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్రం మూడో విడత లాక్ డౌన్ అనంతరం ప్రజా రవాణాకు నిబంధనలతో కూడిన సడలింపులు ఇవ్వనుందని సమాచారం. మోదీ అన్ని రాష్ట్రాల సీఎంల సలహాలు, సూచనలు స్వీకరించి లాక్ డౌన్, ఇతర విషయాల్లో నిర్ణయాలు తీసుకోనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: