పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈరోజు మోదీతో జరుగుతోన్న వీడియో కాన్ఫరెన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర బృందాలు వచ్చి రాష్ట్రంలో ఎలా తనిఖీలు చేస్తాయని ప్రశ్నించారు. కేంద్ర బృందాలు రోజూ నిబంధనలు మారుస్తున్నాయని ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియకుండా ఆ విషయాలను మీడియాకు లీక్ చేస్తున్నాయని అన్నారు 
 
 
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం ప్రారంభమైంది. లాక్ డౌన్, కరోనా నియంత్రణ చర్యల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ వలస కార్మికులు సురక్షితంగా సొంతూళ్లకు చేర్చేందుకు సహాయపడాలని సూచించారు. ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుని సహజ లక్షణం అని గ్రామాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: