ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో కరోనా గురించి ప్రధానంగా చర్చించారు. కరోనాతో సహజీవనం తప్పదని సీఎం మోదీతో చెప్పారు. ప్రజల్లో కరోనా గురించి మరింత అవగాహన కల్పించాలని అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వైరస్ వ్యాపిస్తూనే ఉంటుందని అన్నారు. ఆర్థిక పరమైన అంశాలను కూడా జగన్ ప్రస్తావించారు. కేంద్రం సహాయం అందించాలని కోరారు. ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ కొనసాగనుంది. 
 
ప్రధాని మోదీ కరోనా కట్టడి కోసం అన్ని రాష్ట్రాలు కలసికట్టుగా పని చేయాలని సూచించారు. మన ముందు కరోనా ఛాలెంజ్ ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో కరోనా సోకకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పారు. రెడ్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని మోదీ సూచించారు. పలు రాష్ట్రాల సీఎంలను మోదీ అభినందించారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: