కరోనా రోగి లక్షణాల ఆధారంగా డిశ్చార్జి విధానంలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

 

 కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యాక 7 రోజులు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పారు. హోమ్‌ ఐసోలేషన్ పూర్తయ్యాక పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్ట౦ చేసారు. విదేశాల నుంచి వచ్చేవారు కేంద్ర సూచనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. 23 విమానాల్లో 4వేల మంది భారతీయులను తీసుకొచ్చామని చెప్పిన ఆయన.. 468 రైళ్లలో 5 లక్షల మందికిపైగా వలస కార్మికులను స్వస్థలాలకు పంపామని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: