కరోనా రోగుల మరణాలను గుర్తించే విషయమై ఐసీఎంఆర్‌ కీలక సూచనలు చేసింది. కరోనా రోగులు నిమోనియా, గుండెపోటు, రక్తం గడ్డకట్టడం సహా మరికొన్ని ఇతర రోగాలకు దారితీసి చనిపోతేనే కొవిడ్‌-19 మరణంగా నమోదు చేయాలని తాజాగా తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కొవిడ్-19 కొత్త మహమ్మారి అని, ప్రపంచంలోని అన్ని వర్గాల వారిపై ఈ వ్యాధి ప్రభావం ఉందని తన ప్రకటనలో పేర్కొంది. 

 

ప్రజారోగ్యంపై కరోనా ప్రభావం తెలుసుకొనేందుకు, ప్రణాళికలు అమలు చేసేందుకు గానూ సరైన సమయంలో జోక్యం కోసం భారత్‌కు కచ్చితమైన సమాచారం అవసరమని అభిప్రాయపడింది. మరణాలను ఎవరూ దాయవద్దు అని స్పష్టంగా చెప్పింది. బాధితుడు మరణిస్తే అంతకు ముందు ఉన్న కారణాలను, అంతకు ముందు ఏం జరిగింది అనే విషయాలను తెలుసుకోవాలి అని సూచనలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: