దేశంలో గత ఫిబ్రవరి నెల నుంచి కరోనా వైరస్ ప్రభావం మొదలైన విషయంతెలిసిందే.  తెలంగాణలో మొదట ఎక్కువగా ఈ వైరస్ ప్రభావం కరీంనగర్ ఎక్కువగా కనిపించింది. అక్కడ విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందింది. ఆ తర్వాత జీహెచ్ ఎంసీ పరిధిలో విపరీతమైన కరోనా కేసులు మొదలయ్యాయి.. మరణాల సంఖ్య కూడా ఇక్కడే జరిగింది.  ప్రస్తుతం కొన్ని గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, రెడ్ జోన్లు గా విభజించారు.  అయితే ఈ మద్య ఆరెంజ్ జోన్లో ఉన్నవి కూడా గ్రీన్ జోన్లో కలపబోతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు గత మూడు రోజుల నుంచి మద్యం షాపులు తెరిచారు.. కొన్ని చోట్ల లాక్ డౌన్ ఉల్లంఘన చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.   

 

పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగితే ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, ఆన్ లైన్ మద్యం అమ్మకాలపై చర్చిస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి కట్టడి చేసే క్రమంలో మద్యం డోర్ డెలివరీ అంశాన్ని కూడా పరిశీలిస్తామని వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనాని అరికట్టడానికి ఆన్ లైన్ మద్యం అమ్మకాలవైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టయితే మద్యం విక్రయాలపైనా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. భౌతికదూరం అమలు చేయని దుకాణాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: