ప్రధాని నరేంద్ర మోడీ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణా సిఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆరెంజ్ జోన్ లను గ్రీన్ జోన్లు గా మార్చే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. కంటైన్మేంట్ జోన్ లలో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చెయ్యాలని ఆయన సూచనలు చేసారు. 

 

కరోనా ప్రభావం ఎంత కాలం ఉంటుందో తెలియదు అని అన్నారు. ఎఫ్  ఆర్ బీ ఎం పరిమితిని పెంచాలని కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. కరోనా తో కలిసి జీవించే వ్యూహం సిద్దం చెయ్యాలని ఈ సందర్భంగా ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం ఈ సమయంలో చాలా అవసరమని కేసీఆర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: