తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని రైళ్ల రాకపోకలను పునరుద్ధరించవద్దని కోరారు. ఈరోజు మోదీ అన్నీ రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన భేటీలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దశల వారీగా రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకోవడంతో కేసీఆర్ రైళ్ల రాకపోకల గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. 
 
కరోనా వల్ల... లాక్ డౌన్ వల్ల ఆర్థిక సంవత్సరంపై తీవ్ర భారం పడిందని పేర్కొన్నారు. రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. ఏ రాష్ట్రానికి చెందిన కూలీలను ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని చెప్పారు. మరో రెండు మూడు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: