సాధారణంగా మనుషులకు గడ్డం గీయడం చూస్తుంటాం.. ఇప్పుడు లాక్ డౌన్ పుణ్యమా అని ఎక్కడ బార్బర్ షాప్స్ తెరుచుకోకపోవడంతో ఎంతో మంది గెడ్డాలు పెంచుకొని దేవదాసుల్లా తయారవుతున్నారు.  అయితే మరి మనుషుల పరిస్థితి ఇలా ఉంటే.. ఓ కోతి మాత్రం బేషుగ్గా గెడ్డం గీయించుకోవడం చూస్తుంటే ఔరా దీని పనే బాగుందని అనుకుంటున్నారు.  తాజాగా ఓ కోతి గెడ్డం గీయించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇళ్లకే పరిమితమైన చాలామంది తమలోని టాలెంట్‌ను బయటపెట్టడానికి లాక్ డౌన్ ను ఉపయోగించుకుంటుంటే.. మరి కొంతమంది వినూత్న చర్యలతో వార్తలకెక్కుతున్నారు.

 

కోతికి గడ్డం గీసిన వీడియో వైరల్ అవుతోంది. దానికి షేవింగ్ క్రీమ్ రాసి... చాలానీటుగా గడ్డం గీస్తుంటే.. ఆ కోతి కూడా ఏమాత్రం కదలకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మధ్యమధ్యలో షేవింగ్ క్రీమ్ నాకుతూ ఆ వానరం చేసిన చేష్టలు మరింతగా నవ్వులు పూయింస్తున్నాయి.  లాక్ డౌన్ సందర్బంగా వివిధ జంతువులకు సంబంధించి చిత్ర విచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు జంతు ప్రేమికులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: