మ‌నం ఎంత‌సేపూ పాక్‌, భార‌త్ మ‌ధ్య జ‌రిగే సరిహ‌ద్దు వివాదాలు, ఉగ్ర‌వాదం, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ త‌దిత‌ర అంశాల గురించి మాత్ర‌మే ఎక్కువ‌గా మాట్లాడుకుంటాం. అలాగే.. చైనా, భార‌త్‌ల మ‌ధ్య జ‌రిగే స‌రిహ‌ద్దు గొడ‌వ‌లు, రెండు దేశాల సైనికుల గొడ‌వ‌ల గురించి మాత్ర‌మే మాట్లాడుకుంటాం. కానీ.. ఈ రెండు దేశాలు అంటే పాక్‌, చైనాలు భార‌త్ దేశానికి చెందిన ఎంత భూభాగాన్ని ఆక్ర‌మించాయో తెలుసా..? ఈ రెండు దేశాలు ఆక్ర‌మించిన భూమి ఎన్నికోట్ల ఎక‌రాలు ఉంటుందో తెలుసా..?  ఈ ప్ర‌శ్న‌ల‌కు కొంద‌రు నిపుణులు తాజాగా స‌మాధానం చెబుతున్నారు. పాకిస్తాన్ దాదాపుగా భారత్‌కు చెందిన మూడు కోట్ల ఎక‌రాల‌ను భూమిని ఆక్ర‌మించిన‌ట్లు వారు చెబుతున్నారు.

 

అలాగే.. చైనా కూడా భార‌త్‌కు చెందిన నాలుగు కోట్ల ఎక‌రాల భూమిని ఆక్ర‌మించింద‌ని అంటున్నారు. అలాగే.. గ‌తంలో భార‌త్‌లో క‌లుస్తామంటూ ముందుకొచ్చినా.. బ‌లూచిస్తాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌ దేశాల‌ను క‌లుపుకోలేదు భార‌త్‌. ఇంకా ఆయా దేశాల‌కు సంబంధించిన భూమిని తీసుకుంటే.. మొత్తంగా భార‌త్ మొత్తం ప‌దికోట్ల ఎక‌రాల భూమిని కోల్పోయింద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. కేవ‌లం భార‌త పాల‌కుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే.. ఉదార‌వాదం వ‌ల్లే.. భార‌త్ ఇంత భూమిని కోల్పోయింద‌ని విమ‌ర్శిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: