ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు విషయాల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. అందులో ఒకటి కరోనా కాగా రెండోది మద్దతు ధరల అంశం. రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల కూరగాయలు, ధాన్యం కొనుగోలు మార్కెట్లు మూతబడటంతో మద్దతు ధర గురించి ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే పలు పంటలకు మద్దతు ధరలు ప్రకటించి ఉల్లి, మొక్కజొన్న, ఇతర పంటలను రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. 

 

కానీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం మే 10 2020 వరకు 2996 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 12,60,119 మెట్రిల్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతోంది. గత ఏడాది ఇదే సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 10,00,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని... గత ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ 2,00,000 టన్నుల ధాన్యం కొనుగోలు అదనంగా ధాన్యం కొనుగోలు చేసిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు.  ధాన్యం కొనుగోళ్ల విషయంలో బాబు రికార్డును జగన్ బద్దలు గొట్టాడని వైసీపీ నాయకులు చెబుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: