తెలుగు రాష్ట్రాలను క‌రోనావైర‌స్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇక తెలంగాణ‌లో మాత్రం మ‌హ‌మ్మారి ఒక్క‌సారిగా రెచ్చిపోయింది. తెలంగాణ‌ రాష్ట్రంలో సోమవారం 79మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ యింది. ఈ కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,275కు చేరుకున్నది. ఇందులో ఇప్పటివరకు 30మంది మత్యువాత పడగా, 801 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 444 మంది ప్రస్తుతం గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. సోమవారం 50 మంది డిశ్చార్జి అవగా, వీరిలో హైదరాబాద్‌కు చెందిన 42 మంది, సూర్యాపేట 4, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

 

అలాగే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సోమవారం 38 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులసంఖ్య 2018కి చేరింది. ఇప్పటివరకు 998 మంది డిశ్చార్జి కాగా 48 మంది మృతి చెందారు. ప్రస్తుతం 975 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 7409 శాంపిళ్లను పరీక్షించగా 38 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. అనంతపురంలో 8, చిత్తూరులో 9, గుంటూరులో 5, కృష్ణాలో 3, విశాఖపట్నంలో 3, నెల్లూరులో 1, కర్నూలులో 9 కేసులు నమోదయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: