దేశంలో రోజురోజుకూ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ర్యాండ‌మ్‌గా ప‌రీక్ష‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. కొద్దిరోజులు న‌మోదు అవుతున్న క‌రోనా వైర‌స్ కేసుల్లో కీల‌క ప‌రిణామం క‌నిపిస్తోంది. వైర‌స్ బాధితుల్లో క‌నీసం ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిణామం అని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ర్యాండ‌మ్ ప‌రీక్ష‌లు చేయాల‌ని సూచించింది. రాష్ర్టాల్లో కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.

 

ప్రతి జిల్లాలో వారానికి కనీసం 200 మందికి ర్యాండమ్‌ టెస్టులు చేయించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతిజిల్లాలో ఆరు ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్‌ దవాఖానలను ఎంపిక చేసి, అక్కడికి వస్తున్న 50 మంది ఔట్‌ పేషెంట్లు, 50 మంది గర్భిణులలో కరోనా అనుమానిత లక్షణాలు లేనివారి నుంచి శాంపిల్స్‌ సేకరించాలని పేర్కొన్నది. ఆయా జిల్లాల్లో ప్రతివారం వందమంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు టెస్టులు చేయాలని ఆదేశించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: