కేంద్ర ప్ర‌భుత్వం ప్రయాణికుల రైళ్ల పునరుద్ధరణలో భాగంగా మంగళవారం ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఢిల్లీ నుంచి దిబ్రుగఢ్‌, బెంగళూరు, బిలాస్‌పూర్‌కు ఒక్కోటి చొప్పున మూడు రైళ్లు, హౌరా, రాజేంద్రనగర్‌ (పాట్నా), బెంగళూరు, ముంబై సెంట్రల్‌, అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీకి ఒక్కోటి చొప్పున ఐదు రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ రైళ్లలో మొదటి, రెండో, మూడో తరగతి ఏసీ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. అయితే ఎయిర్‌ కండిషన్‌ కోసం ప్రత్యేక నిబంధనలు పాటిస్తారు. అయితే.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కూడా ప‌లు స్టేష‌న్ల‌లో రైళ్లు ఆగుతాయి.

 

మే 17న సాయంత్రం 4 గంటలకు తొలి రైలు ఢిల్లీ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. ఇక సికింద్రాబాద్‌ నుంచి తొలి రైలు మే 20న మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40 గంటలకు ఢిల్లీ చేరుతుంది. ఈ మార్గంలో నాగ్‌పూర్‌, భోపాల్‌, ఝాన్సీ స్టేషన్లలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయి. ఇక‌ మంగళవారం ప్రారంభమయ్యే బెంగుళూరు-న్యూఢిల్లీ ప్రత్యేక రైలు అనంతపూర్‌, గుంతకల్‌, సికింద్రాబాద్‌, నాగ్‌పూర్‌, భోపాల్‌, ఝాన్సీ స్టేషన్లలో ఆగుతుంది. చెన్నై-న్యూఢిల్లీ మధ్య నడిచే రైలు విజయవాడ, వరంగల్‌, నాగ్‌పూర్‌, భోపాల్‌, ఝాన్సీ, ఆగ్రా స్టేషన్లలో నిలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: