భారతదేశంలో కొవిడ్ -19 పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అంతుచిక్క‌ని విధంగా వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. అందులోనూ గత రెండు వారాల్లో కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు స‌గ‌టున నాలుగువేల‌కు త‌గ్గ‌కుండా న‌మోదు అవుతున్నాయి. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్న దేశాల్లో భార‌త్ కూడా ఒక‌టిగా నిలుస్తోంది. భార‌త్‌లో మంగళవారం ఉదయం నాటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,768 కు పెరిగింది. మరణాల సంఖ్య 2,294 కు చేరుకుంది. కరోనావైరస్ కేసులున్న187 దేశాలలో ప్రస్తుతం భారతదేశం 11వ స్థానంలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

 

అలాగే.. దేశంలో ప్ర‌ధానంగా మూడు నాలుగు రాష్ట్రాల్లోనే అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మహారాష్ట్రలో 22,171 కరోనా పాజిటివ్‌ కేసులు, గుజరాత్ 8,194, తమిళనాడు 7,204 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ముందుముందు భార‌త్ తీవ్ర ప‌రిస్థితులను ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని ప‌లువురు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక‌ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4,253,802 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మరణించిన వారి సంఖ్య 287,250కు చేరుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: