కాకినాడ లోని మడ అడవుల్లో ఇప్పుడు ఇళ్ళ పట్టాలను పంచడానికి చదును చేయడం వివాదంగా మారింది. ఏపీ సర్కార్ అక్కడ చేపడుతున్న చర్యలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. మడ అడవులు పర్యావరణాన్ని కాపాడతాయని అలాంటి అడవులను సొంత మెప్పు కోసం ఏ విధంగా నాశనం చేస్తారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక అక్కడ స్థలాలను చదును చేయడంపై  విపక్ష తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. యుగాల నుంచి తీర ప్రాంతంలో ఉన్న మడ అడవి భూమి కోతకు గురి కాకుండా కాపాడింది అని, పక్షులకు జంతువులకు అది ఆవాస యోగ్యంగా ఉందని, ఆ ప్రాంతాన్ని నాశనం చేయడం భావ్యం కాదని, అటువంటి విలువైన పర్యావరణ మండలాలను హౌసింగ్ ప్లాట్లుగా మార్చడం క్షమించరానిదని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: