విశాఖ గ్రామాలలో స్టైరీన్ గ్యాస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది అని విశాఖ జిల్లా కలెక్టర్ వ్యాఖ్యానించారు. కాసేపటి క్రితం మీడియా తో మాట్లాడిన ఆయన గ్యాస్ ప్రభావం, మిగిలిన చోట్ల దాని నిల్వల గురించి వ్యాఖ్యలు చేసారు. నిన్న రాత్రి నుంచే ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ ని తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

 

దక్షిణ కొరియా కు గ్యాస్ తరలిస్తున్నామని ఆయన చెప్పారు. దక్షిణ కొరియా కు ఇవాళ 8 వేల టన్నుల గ్యాస్ ని తరలిస్తున్నట్టు చెప్తున్నారు. రెండు రోజుల్లో మిగిలిన 5 వల టన్నుల గ్యాస్ ని తరలిస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని కలెక్టర్ మీడియా కు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: