శుభ శ్రీ జీ అనే లేడీ కానిస్టేబుల్ ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. రెండు రోజుల క్రితం సదరు కానిస్టేబుల్ మానసికంగా ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తికి రోడ్డు మీద నోట్లో అన్నం పెట్టారు. దీనిపై చిరంజీవి స్పందించారు. కొన్ని రోజుల క్రితం మీ వీడియో నా దృష్టికి వచ్చింది అని అప్పటి నుంచి మీతో మాట్లాడాలి అని ప్రయత్నాలు చేస్తున్నా అని ఆమె తో వీడియో కాల్ నిర్వహించారు. 

 

ఈ సందర్భంగా ఆమె చర్యలను ఆయన స్వయంగా అభినందించారు. మీకు అలా ఎందుకు చెయ్యాలని అనిపించింది అని, తాను ఆవిడకి ప్రత్యేకించి చేసింది ఏమీ లేదు అని ఆమె వివరించారు. తాను ఆమెకు భోజనం అందించిన సమయంలో ఆమె భోజనం తీసుకునే పరిస్థితి లో లేదని అందుకే తినిపించా అని ఆమె వివరించారు. దాదాపు రెండు నిమిషాల పాటు వీరి సంభాషణ జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: