దేశంలో కరోనా మహమ్మారి ఎప్పటి నుంచి మొదలైందో.. ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లో దీని ప్రభావం చూపిస్తుంది.  మహారాష్ట్రలో అయితే ఇప్పటి వరకు విపరీతమైన కేసులు, మరణాల కూడా పెరిగిపోయాయి. తాగాగా ఇప్పుడు గుజరాత్ లో  కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 347 కేసులు నమోదు కాగా, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 19 మంది ఒక్క అహ్మదాబాద్‌లోనే మరణించడం గమనార్హం. గుజరాత్‌లో గడిచిన 24 గంటల్లో మొత్తం 347 కరోనా కేసులు నమోదు కాగా.. 20 మంది మరణించారు.

 

రాష్ట్రంలో కరోనాతో సోమవారం (మే 11) నాటికి 513 మంది మరణించారు. మొత్తం కేసులు సంఖ్య 8542కు చేరింది. అటు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 70 వేల మార్క్ దాటింది.  ఒక్క అహ్మదాబాద్‌లోనే 6,086 కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,780 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: