క‌రోనా మ‌హ‌మ్మారి పోరుకు పోలీస్ ఫోర్స్ స‌రిపోకపోవ‌డంతో‌ భ‌ద్ర‌తా బ‌లగాల్లోని అన్ని విభాగాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం రంగంలోకి దించింది. ప్ర‌ధానంగా లాక్‌డౌన్ విధుల్లో ఈ బ‌ల‌గాల‌ను నియ‌మించింది. అయితే, దేశంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం ముందుండి పోరాడుతున్న వీరిలో కొంద‌రిని ఆ మహ‌మ్మారిని క‌బ‌లిస్తున్న‌ది. ఇప్ప‌టికే బీఎస్ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ త‌దిత‌ర విభాగాల‌కు చెందిన భ‌ద్ర‌తాసిబ్బందిలో చాలా మంది క‌రోనా వైర‌స్‌ బారిన‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో విధులు నిర్వ‌హిస్తున్న‌ సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐకి ఇటీవ‌ల‌ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా పాజిటివ్‌గా తేలింది.

 

అయితే, ప‌రిస్థితి విష‌మించ‌డంతో సోమ‌వారం రాత్రి ఆయ‌న‌ ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికావ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ ఘ‌ట‌న‌తో లాక్‌డౌన్ విధుల్లో ఉన్న‌ సీఐఎస్ఎఫ్ ఇబ్బంది తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇదిలా ఉండ‌గా... ఇటీవ‌ల ప‌శ్చ‌మబెంగాల్‌లో వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారి కూడా క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. మ‌రో డాక్ట‌ర్ కూడా వైర‌స్‌బారిన‌ప‌డి మృతి చెందాడు. తాజా ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: