దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఎక్కువ ప్రభావం దేశ రాజధానిపై పడింది.  ఇక్కడ మర్కజ్ సమావేశాల తర్వాత ఎన్నో కేసులు పెరుగుతూ వచ్చాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఎంతగా అమలు చేస్తున్నా కరోనా కేసులు మాత్రం పెరిగిపోతూ వస్తున్నాయి.  సీఎం కేజ్రీవాల్ కరోనా కట్టడి చేయడానికి ప్రతి నిత్యం అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించేలా చూస్తున్నారు. ఆదివారం అర్ధ‌రాత్రి 12 గంట‌ల నుంచి సోమ‌వారం అర్ధరాత్రి 12 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 406 క‌రోనా కేసులు న‌మోద‌య్యాఆయి. దీంతో ఢిల్లీలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 7,639కి చేరింది. ఇక 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 13 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 86కు చేరింది.

 

గ‌తంలో 3, 4 రోజులుగా ఉన్న కేసుల డ‌బులింగ్ రేటు ఇప్పుడు 11 రోజుల‌కు చేరింద‌ని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ తెలిపారు. ఈ డ‌బులింగ్ రేటు 20 నుంచి 25 రోజుల వ‌ర‌కు పెరిగితే ఇక‌ ప్ర‌శాంతంగా ఉండొచ్చ‌ని మంత్రి జైన్ అభిప్రాయ‌ప‌డ్డారు.  కొత్త‌గా 383 మంది వైర‌స్ బారి నుంచి కోలుకోవ‌డంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,512కు చేరింది.   భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 70,756కు చేరిందని పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజే 3,604 మందికి వైరస్ సోకగా.. 87 మంది ప్రాణాలు వదిలారు. దీంతో మరణాల సంఖ్య 2,293కి చేరింది.ఈ వైరస్ సోకిన వారిలో 22,454 మంది డిశ్చార్జ్ కాగా.. మిగిలిన 46,008 మంది ఆయా రాష్ట్రాల్లోని కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: