మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ఎన్నికల బరిలో దిగుతూ ఉండటంతో నామినేషన్ పత్రాల్లో ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటించారు. శాసనమండలి ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి తనకు, తన కుటుంబానికి రూ.143.26 కోట్ల రూపాయల విలువగల ఆస్తులున్నాయని చెప్పారు. ఉద్ధవ్ పేరుపై 76.56 కోట్లు, ఆయన సతీమణి రష్మీ ఠాక్రే 52.44 కోట్ల రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 
 
 
బ్యాంకు రుణాలతో కలిపి మొత్తం 15.50 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పారు. ఉద్ధవ్ నామినేషన్ పత్రాల్లో తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు సొంత కారు కూడా లేదు. ఇప్పటివరకు ఆయనపై 23 కేసులు ఉన్నాయి. తన భార్య రష్మీ ఠాక్రే శివసేన పార్టీ పత్రిక సామ్నాకు ఎడిటరుగా పనిచేస్తుందని ఆమెకు పలు వ్యాపారాలున్నాయని సీఎం పేర్కొన్నారు. ఉద్ధవ్ వేతనం, వడ్డీలు, డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్స్ ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: