గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా హైదరాబాద్ నగరంలో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నిన్న 79 కేసులు నమోదు కాగా కొత్త కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. నిన్న నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 1275కు చేరగా మృతుల సంఖ్య 30కు చేరింది. 
 
నిన్న నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు బేగం బజార్, గడ్డి అన్నారం, జియాగుడ, కిషన్‌బాగ్ లో నమోదయ్యాయి. జియాగూడ ఏరియాలోనే ఏకంగా 26 కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ ప్రాంతంలోని షాపులన్నింటినీ మూసివేయించారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నగరంలో కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసుల నిఘా అంత ఎక్కువ‌గా లేక‌పోవ‌టం వల్ల ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కొందరు విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: