దేశవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టకపోగా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 
 
ప్రధాని మోదీ ప్రధానంగా లాక్ డౌన్ పొడిగింపు, వలస కూలీల వ్యవహారం, కొంతమంది కూలీలు ప్రమాదాలలో మరణించడం గురించి మాట్లాడనున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నా ప్రజలు ఇష్టారీతిలో వ్యవహరించడంపై కూడా మోదీ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. మోదీ లాక్ డౌన్ పొడిగింపు గురించి కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు దేశంలో లాక్ డౌన్ ను ఎత్తివేయడానికి ఐదు అంచెల విధానాన్ని కేంద్రం రూపొందిస్తోందంటూ నిన్నటినుంచి ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే వదంతులను నమ్మవద్దని... ఈ వార్తలో నిజం లేదని కేంద్రం ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: